📝 About Us ( మా వెబ్సైటు గురించి):
Welcome to Vajjarapu Vidya Vedika
వజ్జరపు విద్యా వేదికకు ఆత్మీయ స్వాగతం!
వజ్జరపు విద్యా వేదికకు ఆత్మీయ స్వాగతం!
"జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది"
అనే నమ్మకంతో, విద్యార్థులందరికీ నాణ్యమైన, నమ్మకమైన మరియు సమగ్రమైన విద్యా సమాచారాన్ని ఉచితంగా, డిజిటల్ రూపంలో అందించడమే ధ్యేయంగా ఈ "వజ్జరపు విద్యా వేదిక" (Vajjarapu Vidya Vedika) వెబ్సైట్ స్థాపించబడింది.
ఒక ఉపాధ్యాయుడిగా, తరగతి గది నాలుగు గోడల పరిధిని దాటి విద్యార్థులకు నిరంతరం తోడుగా నిలవాలనే తపనతో ప్రారంభమైన ప్రయాణం ఇది. గతంలో కేవలం వాట్సప్ (WhatsApp) గ్రూపుల ద్వారా అందించిన సమాచారాన్ని, ఇప్పుడు మా తోటి ఉపాధ్యాయుల అమూల్యమైన సహకారంతో విస్తృతం చేసి, ఒకే చోట విద్యార్థులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా ఈ సంపూర్ణ డిజిటల్ విద్యా వేదికగా రూపాంతరం అందించాము.
మా పాఠశాల అయిన ZPHS - Ankampalem విద్యార్థుల ప్రగతిని, పాఠశాల జీవితాన్ని (School Life), స్కూల్ ఈవెంట్స్ మరియు ఈ-మ్యాగజైన్ (E-Magazine) విశేషాలను ప్రపంచానికి పరిచయం చేస్తూనే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని నిరంతరం అందించడానికి మేము కృషి చేస్తున్నాము.
🌟 మా వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం & ప్రత్యేకతలు (What We Offer):
1. Academics & Exam Guidance (అకడమిక్స్)
- Study Material & Notes: విద్యార్థులకు ఉపయోగపడే క్లాస్ నోట్స్, ప్రాజెక్ట్ వర్క్స్ (Project Works) మరియు డిజిటల్ స్టడీ మెటీరియల్స్.
- SSC Exams:పదో తరగతి విద్యార్థులకు సంబంధించి Mission March, 100 Days Action Plan, వివరాలు, బ్లూ ప్రింట్, టైం టేబుల్స్ రిజల్ట్స్ etc వాటి వివరాలు అందించడం
2. Education News & Schemes (విద్యా వార్తలు & ప్రభుత్వ పథకాలు):
- Latest Education News: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల తాజా వార్తలు, పరీక్ష తేదీలు & సిలబస్ మరియు విద్యాశాఖ జారీ చేసే ముఖ్యమైన ఉత్తర్వులు (GOs).
- Government Schemes & Scholarships: ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థుల కోసం అమలు చేస్తున్న విద్యా పథకాలు (ఉదాహరణకు: తల్లికి వందనం, విద్యా దీవెన, వసతి దీవెన మొదలైనవి), NMMS మరియు వివిధ రకాల స్కాలర్షిప్స్ సమాచారం.
3. Talent & Online Quizzes (ప్రతిభావంతుల వేదిక):
- Online Quiz Corner: విద్యార్థుల నాలెడ్జ్ పెంచడానికి సబ్జెక్ట్-వైజ్ క్విజ్ (Subject-Wise Quizzes), జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు ఆన్లైన్ మాక్ టెస్టులు.
- Students Achievements: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ.. పరీక్షల్లో ప్రతిభ, క్రీడలు, సాంస్కృతిక పోటీలు, సైన్స్ & ఇన్నోవేషన్ ప్రాజెక్టులలో వారు సాధించిన అవార్డులు, బహుమతుల గుర్తింపు.
- Competitions & Guidelines: పాఠశాల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే క్విజ్, వ్యాసరచన (Essay Writing), వక్తృత్వ (Elocution) మరియు డ్రాయింగ్ పోటీల వివరాలు, గైడ్లైన్స్.
4. Career & Notifications:
- Job & Admission Notifications: ఐఐఐటీ (IIIT), పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ (APRJC) ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు, ఫలితాలు (Results) మరియు కెరీర్ గైడెన్స్.
మా వెబ్సైట్లో అందించే ప్రతి సమాచారం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును మరియు ప్రయోజనాన్ని ఆశించి, నిజాయితీతో కూడిన వివరాలను అందించడానికి కట్టుబడి ఉంటుంది.
If you have any queries, suggestions, or feedback, please feel free to contact us at: vajjarapuvidyavedika@gmail.com
Thank you for visiting our website!
- Team Vajjarapu Vidya Vedika
- Team Vajjarapu Vidya Vedika
Managed by: V Subrahmanyam, SA SOCIAL
0 comments:
Post a Comment